Home / Interviews / Interview with ‘యాది’ Director Yennengee – “learnt a lot of filmmaking on Internet!”
Yennengee PHOTO

Interview with ‘యాది’ Director Yennengee – “learnt a lot of filmmaking on Internet!”

Yennengee is one of the many aspirants who want to make movies. This youngster who could only study till Intermediate before plunging into movies talks about his struggle to make his dream into reality. He studied moviemaking books on Internet and dived headlong into movies assisting director Ramesh Reddy Thummala before making the shortfilm ‘Yaadi’ centered around suicides of Telangana youth for Statehood. తెలంగాణా సినీ కళాకారులను, తెలంగాణా కధలకు ఒక వేదికను ఏర్పాటు చేసుకోడానికి ఉద్యమములో మమేకమైన వ్యక్తులు, సంస్థలు కలిసి ఈ మధ్య Film Telangana Festival పేరిట షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. అనేకమంది కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఫెస్టివల్ లో ‘యాది’ అనే షార్ట్ ఫిలిం ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం, ఉత్తమ చాయాగ్రహణం కు గాను అవార్డులు గెలుచుకున్ధి. ఫెస్టివల్ కు ఎంపికై నాలుగు అవార్డులకు గాను మూడు అవార్డులు గెలుచుకుంది. అంతే కాకుండా, ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ISB) లో జరిగిన ఆగష్టు ఫెస్ట్ లో Official Selection గా తెలంగానాన్ని సగర్వంగా చాటింది మన యాది. మొత్తం 50 చిత్రాల్లో ఎంపికైన చిత్రాలు ఎనిమిదే. అందులో మన యాది చిత్రమొక్కటే తెలంగాణా నుండి. ఈ షార్ట్ ఫిలిం లింక్ ఇదివరకు ఈ సైటులో షేర్ చేయడం జరిగింది. మరోసారి మీ కొరకు క్రింద పబ్లిష్ చేసాము. ఈ షార్ట్ ఫిలిం కి అన్ని తానై కథ, screen-play, మాటలు, పాటలు, నిర్మాణం, దర్శకత్వం చేసింది యువ కళాకారుడు నరేందర్ గౌడ్ నాగులూరి. యెన్నెన్జీ (NNG) అనే తెర పేరు తో ‘యాది’ లో దర్శకత్వంలో అరంగేట్రం చేసిన ఇతనితో ఒక్క చిన్న Interview ఇది. తన మాటల్లోనే అతని సినీ రంగ ప్రవేశం, అనుభవాలు, ఆశలు, అవకాశాల గురించి చదవండి.

What is your family background (parents, siblings, native place etc)?
నా పూర్తి పేరు నరేందర్ గౌడ్ నాగులూరి. తెర పేరు యెన్నెన్జీ (NNG). నేను పుట్టి పెరిగింది అంతా నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ మండలం లోని పల్లెటూరు హసన్ పల్లి ల. తల్లిదండ్రులు ఊర్లోనే ఉంటారు ఇద్దరు చెల్లెళ్ళు, వారికి పెళ్ళిళ్ళు అయ్నయి. ఇగ లైన్ల నేనే ఉన్న పెళ్ళికి :-). మాది లోయర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీ. బతకడం కోసం దినదినం స్ట్రగుల్ చేసే ఫ్యామిలి నుండే వచ్చాను. నాన్న కుల వృత్తి అయిన కల్లు గీత పని చేస్తాడు. అమ్మ హోం మేకర్.

What about your education? Did you get trained in film-making?
7 వ తరగతి వరకు ఊర్లోనే చదివను. అటు తర్వాత పోచంపాడ్ గురుకులం లో 10 వరకు చదివాను. ఇంటర్ బోధన్ లో చేసినప్పుడు చుసిన సినిమాల వాళ్ళ కలిగిన ఇన్స్పిరేషన్తో, సరిగ్గా చదవక ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏదో ఒక పని చేస్తా పట్నం లో అని ఇంట్లో చెప్పి సినిమా స్టూడియోల వెంట తిరిగి ఎక్కడ కూడా పని దొరకక చివరికి మల్లి ఇంటికి వచ్చెసను. కానీ సినిమా పై ప్యాషన్ మాత్రం పోక ఇంటర్నెట్లో సినిమా బుక్స్ చదువుతూ నాలెడ్జ్ పెంచుకున్న. నేను DMLT అపోలో లో చదివినను. ఆ చదువు ద్వారానే నేను ప్రస్తుతం నిజామాబాదు లోని ప్రభుత్వ రక్త నిధి లో కాంట్రాక్టు బేసిస్ లో టెక్నికల్ సుపెర్వైజర్ గా పని చెస్థున్నను. 2008 లో ఇంటర్నెట్ లో నా తల్లి తెలంగాణా అనే సినిమా చూసి ఆ సినిమా డైరెక్టర్ అయిన శ్రీ రమేష్ రెడ్డి తుమ్మల గారికి అభినదించడానికి ఫోన్ చెశను. అల అతనితో స్నేహం పెరిగి నేను next చేస్తున్న తెలంగాణా గోదావరి చిత్రంలో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావ (దేవానంద్- హీరో ఫ్రెండ్ రోల్ ) అని అడిగితే ఒప్పుకుని చెయ్యడం జరిగిన్ది. అదే టైం లో Direction పై నాకున్న వ్యామోహంతో, సబ్జెక్టు మీద నాకున్న పట్టుతో ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్గ జాయిన్ చెస్కున్నరు. అలా నా థియరిటికల్ నాలెడ్జ్ కి ప్రాక్టికల్ గా అనుభవం జత కలిసిన్ది.
సో థాంక్స్ రమేష్ రెడ్డి తుమ్మల అన్న!

What are the other experiences you had before making ‘Yaadi’?
తెలంగాణా గోదావరి సినిమా తర్వాత నేను మేర భారత్ మహాన, మరక, రాజిగా ఓరి రాజిగా, మరి కొన్ని ప్రకటన చిత్రాలకు దర్శకత్వ శాఖలో కో-డైరెక్టర్ గా పనిచేశాను. యాది చిత్రం నా దర్శకత్వం లో మొదటి చిత్రమ్.

How did you get the concept of Yaadi? Was there any immediate inspiration?
తెలంగాణా లో జరుగుతున్న ఆత్మహత్యలు నన్ను కలిచి వెసెవి. కొడుకు కి చిన్న దెబ్బ తగిలిన్ది అంటేనే తల్లిదండ్రులు విలవిలలాదిపొథరు. అలాంటిది కన్నా కొడుకు కళ్ళ ముందే కాలి పోతుంటే వాళ్ళ పరిస్థితి ఎల ఉంటుంది అని ఊ హిన్హుకున్నపూడ ల్ల విపరీతమైన బాధ కలిగెది. అలా మది లో నుండి పుట్టిన చిత్రమే ఈ యాది. ఆ టైం లోనే ఫిలిం తెలంగాణా ఫెస్టివల్ ఉండడంతో పక్క స్క్రప్ట్తో ముందుకు వెళ్ళాను. అలా ఫిలిం తెలంగాణా డెడ్ లైన్ డేట్ నా మెడ మీద కత్తిలా ఉంది నేను సినిమా తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం అయిన్ది. సో థాంక్స్ జయప్రకాష్ తెలంగాణా. ఈ సినిమాకి బడ్జెట్ ప్రాబ్లం చాల వచ్చిన్ది. బట్ అన్నిటిని తట్టుకుని ముందుకెళ్ళి సినిమా ని నిర్మించం. నా లక్ష్యం ఒక్కటే చనిపోతున్న అమరులకి నివాళులు అర్పిస్తూ, వాళ్ళ కుటుంబాలకు సానుబుతి ని ప్రకటిస్తూ మిగతా వాళ్ళకి దైర్యం నూరిపోస్తూ కాలికూలి పోవడం కాదు యుద్ధంలో కలబడటమే పోరాటం అని చెప్పదమ్. అందులో సక్సెస్ అయ్యననే నమ్ముతున్న, మీ అందరి పాజిటివ్ కామెంట్స్ చుసిన తరవాత. 17 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి పని చేసిన వారంతా కొత్తవారే.సందేశం – సమస్య కు పరిష్కారం ఆత్మహత్య లు కావు, కాలి కూలబడడం కాదు, యుద్ధం లో కలబడటం అని చెప్పాం.

Who all helped you make this film?
ఈ సినిమా నిర్మించడానికి నాకైన ఖర్చు 50,000 పైనె. ఇందుకోసం నేను చాల మందిని సంప్రదించిన కుడా పాజిటివ్ రెస్పాన్స్ రాలెదు. ఇందులో నేను స్వంతంగా 30,000 పైగా పెట్టుకున్నాను. మిగతా 20,000 మిత్రులు సహాయం చెసరు. వివేక్ రావు పడకంటి, రాకేశ్ రెడ్డి గడ్డం, రమేష్ పబ్బా, నరసింహారెడ్డి తగిరంచ, గోపాల్ బోధన్ మరియు నాగేల్లి పరమేష్ గౌడ్ ఈ సందర్భంగా వాళ్ళందరికీ పేరు పేరున దన్యవదములు. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులకి, నటి సత్యప్రియకి నా దన్యవాదములు. నన్ను అనుక్షణం ప్రోత్సహించిన అమ్మ నాన్నలకు, నా గురుతుల్యులు రమేష్ రెడ్డి తుమ్మల గారికి దన్యవాదములు.

In what categories are awards won by the film?
ఫిల్మ్ తెలంగాణా ఫెస్టివల్ కు ఎంపికై నాలుగు అవార్డులకు గాను మూడు అవార్డులు కొల్లగొట్టింది.
బెస్ట్ ఫిల్మ్: (కథ –స్క్రీన్ ప్లే –మాటలు-పాటలు-నిర్మాణం –దర్శకత్వం: యెన్నెన్జీ(నరేందర్ గౌడ్ నాగులూరి)),
బెస్ట్ మ్యూజిక్: గిడియన్ ఫెలిక్స్,
బెస్ట్ సినిమాటోగ్రఫీ: సిరుని టీ నరేష్ అవార్డులు గెలుచుకున్నారు. ఈ ఈవెంట్ September 8 న జరిగింది.

what are the practical challenges you faced while making the movie?
ఆల్రెడీ నేను సినిమాలకి వర్క్ చేసి ఉండడం వాళ్ళ ప్రాక్టికల్గ నాకు పెద్దగ ప్రొబ్లెమ్స్ రాలేవనే చెప్పాలి కనీ ప్రొడక్షన్ని కూడా నేనే మేనేజ్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నాను. టైం కి తిండి రాకపోయినా, చాయిలు రాక పోయిన మనమే కల్పించికునై ఫోన్ చేయడం లాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బ్నది గానే ఉంటది. కాకపోతే రెండు రోజులు అనుకున్న షూట్లో ఫస్ట్ రోజంతా షూట్ ఆల్మోస్ట్ వేస్ట్ అయిన్ది. హైదరబాద్ నుండి ఉదయం 7 గంటలకే రావాల్సిన కెమెరా యూనిట్ మధ్యహ్నం 2 కి రావడం, వారోచ్చిన తర్వాత కూడా వర్షం పడుతుండడంతో చాల కష్టమయింది. అందుకే ఆదరాబాదరాగా మిగిలిన ఒక్కరోజులోనే షూట్ చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ మెసేజ్ సీన్ని కేవలం 10 నిమిషాల్లో షూట్ చేయడం జరిగింది టైం లెక. అంతకు మించి ఇంకో రోజు షూట్ పెట్టుకున్దామన్న బడ్జెట్ లేకపోవడంతో ఉన్నంతలో చేసుకోవల్సచోంది. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా బడ్జెట్ వల్ల చాల ఇబ్బంది పడ్డాను. మొదటి చిత్రం అవడంతో అంత తొందరగా ఎవరు ముందుకు రారు డబ్బులు పెట్టడానికి. కొంత మందే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా చిత్రాన్ని పూర్తి చేయాలనే ఒకే పట్టుదలతో ముందుకెల్లాను. సాదించాను!

Where did you shoot the film?
ఈ సినిమా అంత ఒక్క రోజులోనే షూట్ చేసాం. ఇదంతా మా సొంత ఊరైన హసన్పల్లిలో చేయడం జరిగిన్ది. ఈ సందర్భంగా నేనోక్కటి చెప్పదలుచుకున్నాను లొకేషన్స్ అని ఎక్కడికో ఫారెన్కో, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అరకును ఉరికిచ్చే లొకేషన్స్ మన దగ్గరే చాల ఉన్నయి.

How did you gather the cast and crew?
ఈ సినిమాలో యాదిగ చేసిన కిశోర్ కుమార్ దైవాలని అంతకు ముందే ఒక సినిమా చర్చావేదికలో కరీంనగర్లో కలిశాను. అతని అమాయకమైన ముఖం నాకు అలాగే గుర్తుంది పోయింది. Facebookలో ఒక రోజు నటీనటులు కావాలని పెట్టినపుడు నేను పని కోస్తాన అని ఒక మెసేజ్ పెట్టాడు కిశొర్. సో అతను నాకు ఆప్ట్ అని తీస్కోవడం జరిగింది. ఇక యాది తల్లి లక్ష్మమ్మ క్యారెక్టర్ కోసం చాల మందిని వెతికి వెతికి, కొంత మందిని అడిగి ఫెయిల్ అయ్యి చివరికి కొంత మంది సలహాతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సత్య ప్రియ గారిని సంప్రదించడం జరిగింది. స్టొరీ విన్న తను ఎలాగైనా చేయాలన్న పట్టుదలతో ఊరికొచ్చి రెండ్రోజులు మాతో పాటే గడిపి, మా ఇంట్లోనే ఉండి చాల సహకరించింది. ఇక మిగతా crew కొoదరిని Facebook ద్వార, మరి కొంత మందిని friendsని తీస్కోవడం జరిగిన్ది. ఈ సినిమాకి వర్క్ చేసిన కెమరామెన్ శిరుని టీ నరేష్ MFA కి కూడా ఇది ఫస్ట్ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ ఫెలిక్స్ కి ఫస్ట్ ఫిలిం. సింగర్ లక్ష్మి మానస కి ఫస్ట్ ఫిలిం. నాకు లిరిక్ రైటర్గ సహకారం అందించిన నరసింహ రెడ్డికి, మల్లెగోడ గంగ ప్రసాద్ కి ఫస్ట్ ఫిలిం.

Who are your favorite filmmakers and what inspired you to come into filmmaking?
తెలుగు లో నేను శేఖర్ కమ్ముల, రాజమౌళి ని ఇష్టపడతాను. హిందీలో ప్రకాష్ ఝ, రాజ్ కుమార్ హిరాని, ఇంగ్లీష్లో జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్ ని బాగా ఇష్టపడతాను. నాకు హ్యూమన్ ఎమోషన్స్ ని తెరకెక్కించడం అంటే చాల ఇష్టం. నేను ఏదైనా సన్నివేశం చూసిన నిజ జీవితంలోల ఫీల్ అవుతాను. అదే అనుభూతిని ప్రేక్షకుడికి కూడా అందించాలనే తాపత్రయంతో మాత్రమే సినిమాలు తీస్తాను భవిష్యతులో కూడా. తెలంగాణా కల్చర్ ని, బాషని, నా సినిమాలల్లో ప్రతిబింబి చేస్తాను. నిజ జీవితంలోని కథలను మాత్రమే తెరకేక్కించాలి అనే తపనతో మాత్రమే పని చేస్తున్నాను.

What are your next plans and future projects?
ఈ యాది చిత్రం తర్వాత నాకు ఒక ప్రొడ్యూసర్ ఫీచర్ ఫిలిం ఆఫర్ కూడా ఇఛ్చరు. జనవరి కి సినిమా స్టార్ట్ అవుతుండోచు. అంతకు మునుపే నేను “ఉత్తచేతుల బిక్షపతి” అనే ఒక కామెడీ షార్ట్ ఫిలిం చేయబోతున్నాను. దాని తర్వాత మనం మరిచిపోతున్న మన రూట్స్ ని కల్చర్ ని గుర్త్ర్హు చేసే టెలివిజన్ ట్రావెల్ షో ROOTERS (రూటర్స్) చేయబోతున్నాను. ఈ షో లో పాల్గొనడానికి అంగీకరించిన ప్రముఖ పుస్తక రచయిత శ్రీ పరవస్తు లోకేశ్వర్ గారికి దన్యవాదములు. ఈ షో యొక్క థీమ్ ఇది – Globalization has Connected the World to your palm thus ignoring the locals. So Localization is the Goal. Discovering the Roots and Culture.

మేము ఈ యాత్రని ఆదిలాబాద్ నుండి ప్రారంభించాబోతున్నాం. ఈ షో కాప్షన్ ఇది – Every Friend has a Road and Every Road has A Friend. 7 మంది 7 రోజులు 7 సైకిల్ లపై చేసే సాహసయాత్రనే ఈ రూటర్స్. డిసెంబర్లో మా యాత్ర స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రాజెక్ట్కి ఇంటరెస్ట్ ఉన్న సహా నిర్మాతలు కావలెను. అటు తర్వాత నిజామాబాద్ లో Cinema Club స్తాపించాలని ఉన్ది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఫీచర్ ఫిలిం చేయబోతున్నాను. లక్ష్యం మంచి దర్శకుడిగా స్తిరపడడం. తక్కువ బడ్జెట్ లో పెద్ద చిత్రాలను మంచి కథలతో నిర్మించే ఒరవడిని ప్రారంభించి రాబోయే తెలంగాణ చిత్ర యవనిక పై చెరగని ముద్ర వేయాలని ఆశయం.

What should be done to develop Telangana film industry. Share some ideas?
మొట్టమొదటిగా మన దగ్గర నుండి నిర్మాతలు పుట్టనంత కాలం కొత్త డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు రావడం చాల కష్టం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఫిలిం క్లబ్ స్తాపించి అలాగే లఘు చిత్రాలను నిర్మించే వారిని ప్రోత్సహించాలి. మన దగర ఉన్నావారికీ నటించాలన్న కుతూహలం ఉంది కనీ వాళ్ళకు ప్రాక్టికల్గ నాలెడ్జే లేకపోవడం ఒక మైనస్ పాయింట్. ఈ ఫిలిం క్లబ్ లలో సంవత్సరినికి ఒక్కసారైనా అనుభవజ్ఞులతో సలహాలు కోచింగ్లా పెడితే అందరికి ఉపయోగ కరంగా ఉంటది. ఎందుకంటె ఈ రోజుల్లో బయట కోచింగ్ అంటే లక్షల్లో మాటే. ఫిలిం ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తే లఘు చిత్ర దర్శకులని ప్రోత్సహించి నట్టు ఉంటుంది. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నవారిని ఎంకరేజ్ చేసేలా ప్రభుత్వ చర్యలుండాలి. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను ప్రోత్సహించాలి.

Watch YAADI Short Film here -

Here is the Gallery Of YAADI movie -

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

10,737 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>