Home / తెలుగు / పాఠ్యాంశంగా సార్ జీవితచరిత్ర

పాఠ్యాంశంగా సార్ జీవితచరిత్ర

 

Prof Jayashankar

Prof Jayashankar

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హోమ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లేశం హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సార్ చేసిన సేవలను కొనియాడారు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. సార్ జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని అన్నారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ ఉద్యోగుల భవనానికి జయశంకర్ భవన్‌గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సం ఘాల నాయకులు మాట్లాడుతూ అన్ని రకాల విద్యాసంస్థల్లో జయశంకర్ సార్ చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచేలా నిబంధన విధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

కార్యక్రమంలో ఓయూ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, ఎన్జీవో అసోసియేషన్ పార్థసారధి, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లేష్, ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మహమూద్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి: వంగపల్లి

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి అయిన ఆగస్టు 6వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జయశంకర్ 81వ జయంతిని బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో టీజీవీపీ (నవనిర్మాణ్) ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లేషం, టీజీవీపీ (ఎన్) రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుర్తి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,278 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>